వరంగల్‌లో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వరంగల్ : వరంగల్‌లో కొలువుదీరిన భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం భద్రకాళీ అమ్మవారికి గణపతి పూజతో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొలి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రకాళీ అమ్మ వారని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి.
ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు భద్రకాళీ ఆలయానికి తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేసవి కారణంగా అధిక ఎండల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
30వ తేదీతో ముగియనున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు..
20వ తేదీన అగ్నిప్రతిష్ట, చతుష్టానార్చన, వృషభ వాహన సేవ, మృగ వాహన సేవ.
21వ తేదీన శంకర జయంతి, మకర వాహన సేవ, చంద్ర ప్రభ సేవ, శ్రీభద్రకాళీభద్రేశ్వరుల ఎదుర్కోలు.
22వ తేదీన సింహ వాహన సేవ, గజవాహన సేవ, శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం.
23వ తేదీన సదస్యం సూర్యప్రభ వాహన సేవ, హంస వాహన సేవ.
24వ తేదీన పలక్లీ సేవ, శేష వాహన సేవ.
25వ తేదీన గంధోత్సవం, సాలభంజికసేవ.
26వ తేదీన రథోత్సవం
27వ తేదీన డోలోత్సవం, భద్ర పీఠ సేవ, ఆశ్వ వాహనసేవ.
28వ తేదీ వసంతోత్సవం, చతురన్తసేవ, విమానసేవ.
29వ తేదీ శరభవాహన సేవ, పుష్పరథ సేవ.
30వ తేదీ పుష్పయాగం ఉత్సవాల ముగింపు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.










Comments