వావ్.. మిల్లర్
బెంగళూరు: నరాలు తెగే ఉత్కంఠ మధ్య డేవిడ్ మిల్లర్ (10 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 నాటౌట్) ఆఖర్లో రెండు సిక్స్‌లు బాదడంతో.. శనివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను ఓడించింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 175/8 స్కోరు చేసింది. ఓపెనర్ సాల్ట్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అక్షర్, కుల్దీప్, ఎన్‌గిడి తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 179/4 స్కోరు చేసి గెలిచింది. పేసర్ భువనేశ్వర్ (3/26) దెబ్బకు.. 18/3తో ఢిల్లీ ఇబ్బందుల్లో పడిన తరుణంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), ట్రిస్టన్ స్టబ్స్ (47 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 నాటౌట్) నాలుగో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. హాఫ్ సెంచరీ చేసిన రాహుల్‌ను క్రునాల్ అవుట్ చేశాడు. కానీ, కెప్టెన్ అక్షర్ పటేల్ (26 రిటైర్డ్ హర్ట్)తో కలసి స్టబ్స్ ఐదో వికెట్‌కు అజేయంగా 47 పరుగులు జోడించి జట్టు ఆశలను సజీవంగా ఉంచాడు. కండరాలు పట్టేడయంతో అక్షర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా.. మిల్లర్‌తో కలసి స్టబ్స్ ఆరో వికెట్‌కు అభేద్యంగా 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో క్యాపిటల్స్ మరో బంతి మిగిలుండగానే గెలుపు గీత దాటింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 15 రన్స్ కావాల్సి ఉండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌లో 2 బంతుల్లో 2 పరుగులు చేయడంలో విఫలమైన మిల్లర్ ఈసారి తన సత్తాచాటి జట్టును గెలిపించాడు. స్టబ్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.










Comments