శభాష్.. శర్వాణిక
చెన్నై: తమిళనాడుకు చెందిన శర్వాణిక ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌ప అండర్-12 బాలికల విభాగంలో టైటిల్ కొల్లగొట్టింది. సెర్బియాలో జరుగుతున్న ఈ టోర్నీలో రెండు రౌండ్లు మిగిలుండగానే ఆమె టైటిల్ దక్కించుకోవడం విశేషం. మొత్తం 11 రౌండ్లలో.. ఉమెన్ క్యాండిడేట్స్ మాస్టర్ శర్వాణిక 10 విజయాలు సాధించి ఒక గేమ్‌ను డ్రా చేయడం ద్వారా 10.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. తొమ్మిదో రౌండ్లో తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థి ఎమా జక్సా (స్లోవేనియా)పై గెలవడం ద్వారా శర్వాణిక టైటిల్ ఖాయం చేసుకుంది. 11 ఏళ్ల శర్వాణికకు ఇది రెండో ప్రపంచ టైటిల్. గత ఏడాది ఆమె అండర్-10 వరల్డ్ క్యాడెట్ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకం నెగ్గింది. ఇక.. 2024లో ఫిడే ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షి్‌పలో శర్వాణిక రజతం సొంతం చేసుకుంది.










Comments