స్కూలు విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధిస్తూ చట్టం: అనిత
ఆంధ్ర ప్రదేశ్ : పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్వేషపూరిత, అసభ్య పోస్టుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులపై 1,384 కేసులు నమోదు చేశామని, 1,067 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.










Comments