సెట్లో ‘మాస్’ జాతరే జాతర..
ఇటీవల కాలంలో దక్షిణాదిన అతి తక్కువ సమయంలో ‘స్టార్‌డమ్’ సంపాదించిన హీరోయిన్లలో శ్రీలీల టాప్‌లో ఉంది. తెలుగులో బిజీగా ఉంటూనే, మరోవైపు బాలీవుడ్‌లోనూ ఎంటరవుతోందీ డ్యాన్సింగ్ క్వీన్. మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘మాస్ జాతర ’తో అలరించేందుకు సిద్ధమైన ఈ వైరల్ వయ్యారి పంచుకున్న కొన్ని ముచ్చట్లివి...
ప్రాంక్స్ చేస్తా...
సెట్లో నిశ్శబ్దంగా ఉండటం నాకు నచ్చదు. సెట్ అంతా కలియతిరుగుతూ, అందర్నీ పలకరిస్తూ సందడిగా ఉంటా. కో-స్టార్స్ మీద సరదాగా ప్రాంక్స్ చేస్తా. సెట్ నుంచి బయటకి రాగానే ఆ రోల్ నుంచి స్విచాఫ్ అయిపోతా. అందుకే ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నా. షూటింగ్‌తో ఎంత అలసిపోయినా... పుస్తకం తెరిస్తే మాత్రం ఆసక్తిగా చదువుతా. బుక్ రీడింగ్ చాలా ఇష్టం.
ఆరు భాషలు తెలుసు...
కొత్త భాష నేర్చుకోవడం అంటే భలే ఆసక్తి. ఆరు భాషల్లో గలగలా మాట్లాడతా. ఇంట్లో అందరం తెలుగులోనే మాట్లాడతాం. బెంగళూరులో పెరిగాను కాబట్టి కన్నడ వచ్చు. భాష మీద ఇష్టంతో తమిళం నేర్చుకున్నా. మెడిసిన్ ముంబాయిలో చేయడం వల్ల హిందీ వచ్చేసింది. ఇక స్కూల్‌లో సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ కాబట్టి అది కూడా వచ్చు. ఇంగ్లీషు ఎలాగూ మాట్లాడేస్తా.
అమ్మతో అట్లకాడ దెబ్బలు...
చిన్నప్పటి నుంచీ మేకప్ వేసుకోవడమంటే సరదా. అమ్మ హ్యాండ్‌బ్యాగ్ నుంచి లిప్‌స్టిక్ దొంగిలించి మరీ వేసుకునేదాన్ని. ఓసారి దొరికిపోయి అమ్మతో అట్లకాడ దెబ్బలు కూడా తిన్నా. అమ్మ చేసిన అన్నం, ముద్దపప్పు అంటే ఇష్టం. వాటికి నెయ్యి, ఆవకాయ జోడించి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తా. పనీర్ మండీ అంటే చాలు... ఎనర్జీ వచ్చేస్తుంది.
వస పిట్టను...
నిద్ర లేవగానే స్ట్రెచెస్ చేసి.. ఫోన్ చెక్ చేసుకుంటా. తర్వాత బ్లాక్ కాఫీ తాగి, కాసేపు వ్యాయామం చేస్తా. ఆపై కాసేపు ప్రశాంతంగా నచ్చిన సంగీతం వింటా. మ్యూజిక్ వింటే నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. రోజంతా హైపర్‌గా ఉంటా. నేను మాట్లాడడం మొదలుపెడితే పాజ్ బటన్ ఉండదు. వస పిట్టలా వాగుతా. అందుకే ‘నువ్వు గోడలతో కూడా మాట్లాడగలవు లీలా’ అంటారు ఫ్రెండ్స్.
కాబోయేవాడు...
నాకు కాబోయేవాడికి ముచ్చటగా మూడు లక్షణాలుండాలి. మొదటిది... కొన్ని విషయాల్లో నన్ను భరించడం కష్టం. అయితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాలి. రెండోది... చక్కని హాస్య చతురతతో నవ్వించే వాడై ఉండాలి. మూడోది.. ఫ్యామిలీమ్యానై వుండాలి. ఈ మూడు గుణాలుంటే కళ్లు మూసుకుని ఓకే చేస్తా. కాకపోతే పెళ్లి చేసుకునేందుకు బోలెడు సమయం ఉంది.
తిడతా.. ఏడుస్తా...
ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ అమ్మ మీదే ఆధారపడతా. అమ్మ లేకుండా ఒంటరిగా నిద్రపోలేను. నాకు భయం. అందుకే ఔట్‌డోర్ షూటింగ్‌లకు అమ్మను వెంట తీసుకెళ్తా. కోపం వస్తే అమ్మ మీద అరిచేస్తా. కోపం చల్లారాక అమ్మను తిట్టినందుకు ఏడుస్తా.
పర్సనల్ ఛాయిస్
- నాకు మ్యాగీ అంటే పిచ్చి. అర్థరాత్రి అమ్మకి తెలియకుండా గప్‌చుప్‌గా వెళ్లి మ్యాగీ తినేసి వచ్చిన రోజులు ఎన్నో.
- రోజుకు కనీసం ఐదారు సార్లయినా నా ఫోన్ కింద పడేసుకుంటా. అందుకే నా ఫోన్‌కు కూడా ఒక బాడీగార్డ్ అవసరమని నన్ను ఆటపట్టిస్తుంటారు.
- తెల్లవారుజామున 2 గంటల దాకా రీల్స్ చూస్తా.
- సాయిపల్లవి డ్యాన్స్, సమంత కాన్ఫిడెన్స్, పూజా హైట్, తమన్నా వ్యక్తిత్వం, రష్మిక మందన్నలోని చిలిపితనం బాగా నచ్చుతాయి.
- స్పై, కామెడీ విలన్ పాత్రల్లో నటించాలనే కోరిక ఉంది.
- ప్రయాణాల్లో కచ్చితంగా ఇయర్‌ఫోన్స్, చిప్స్ వెంట ఉండాల్సిందే. మేకప్ ఐటమ్స్ అయినా మర్చిపోతాను గానీ, చిప్స్ తీసుకెళ్లడం మాత్రం మర్చిపోను.









Comments