సన్ రైజర్స్ మ్యాచ్లో చేతబడి కలకలం.. అసలు ఏం జరిగిదంటే?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శనివారం) సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ గెలిచింది. నిన్నటి మ్యాచ్‍లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. ఇది ఇలా ఉఁటే.. సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేతబడి చేసినట్లు ఉండే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమాని నిమ్మకాయ చేతిలో పట్టుకున్న్నాడు. అంతేకాక ఓమ్ భూమ్ భుష్ అన్నట్లుగా మంత్రాలు చదుతున్నాడు. అతడు మంత్రలు చదివిన వెంటనే శివమ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సదరు ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దుబే ఔట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక చెన్నై ఓటమికి సదరు వ్యక్తి చేతబడే కారణం అంటు మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంఘటనపై సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ ఓ లెటర్ హెడ్ సైతం నెట్టింట్లో వైరలవుతుంది.










Comments