స్వచ్ఛత హి సేవా కార్యక్రమం – నివేదిక దలిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC)
స్వచ్ఛత హి సేవా కార్యక్రమం – నివేదిక
దలిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు విశాఖపట్నం నగరంలోని NAD, గాజువాక, మద్దిలపాలెం జోన్లలోని వ్యర్థ సేకరించేవారి బస్తీలలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ప్రజల కోసం ర్యాలీలో శుభ్రత ఆరోగ్యం పర్యావరణ భవిష్యత్తు అనే నినాదంతో ర్యాలీలో పిల్లలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛత గురించి వివరించారు. గగనంతారం ఆర్కే బీచ్ ను ఇతర వ్యర్ధాలను తొలగించడానికి కార్యాచరణ చేపట్టారు.
ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం కమ్యూనిటీ సభ్యులలో శుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం. ప్రతి బస్తీలో శానిటేషన్, హెల్త్ & హైజిన్ పై చర్చలు జరిపి, గృహ శుభ్రత, వ్యర్థాలను వర్గీకరించి వేయడం, వ్యాధుల నివారణలో శుభ్రత ప్రాముఖ్యత గురించి వివరించబడింది. అలాగే చెట్ల నాటకం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేశారు.ఈ కార్యక్రమాలలో కమ్యూనిటీ సభ్యులు, మహిళలు, యువత, పిల్లలు చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు ర్యాలీలలో పాల్గొని “శుభ్రతే ఆరోగ్యం – పర్యావరణ రక్షణే మన భవిష్యత్తు” అనే సందేశాన్ని ప్రాచుర్యం చేశారు.అక్టోబర్ 1న ఆర్.కె. బీచ్ వద్ద ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీచ్ పరిసరాల్లో వ్యర్థాలను సేకరించి, శుభ్రతా సందేశాన్ని స్థానిక ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గోవింద, జివిఎంసి సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ సభ్యులతో కలసి శుభ్రతా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.
డీబిఆర్‌సి తరఫున జిల్లా సమన్వయకర్త నిఖిల, నగర సమన్వయకర్తలు అజయ్, గురునాధ్, ధనలక్ష్మి మరియు ఇతర సిబ్బంది చురుకుగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.ఈ సందర్భంగా కమ్యూనిటీ సభ్యులు డీబిఆర్‌సి చేపడుతున్న ప్రయత్నాలను అభినందించి, శుభ్రతా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. వారు DBRC పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Comments