• Aug 25, 2026
  • NPN Log

    మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డాక్టర్ డూమ్‌ ప్రోమోను విడుదల చేసారు. ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ ప్రోమోను రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు ఆస్కార్ అవార్డు విజేత, డాక్టర్ డూమ్ పాత్ర పోషిస్తున్న రాబర్ట్ డౌనీ జూనియర్, సినిమా టీమ్ పాల్గొన్నారు.

    ఈ ప్రోమోలో రాబర్ట్ డౌనీ జూనియర్ విక్టర్ వాన్ డూమ్/డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించారు. ఇప్పటివరకు ఐరన్ మ్యాన్‌గా మెప్పించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు MCUలో అత్యంత శక్తివంతమైన విలన్‌గా కనిపించబోతున్నారు. డాక్టర్ డూమ్, థోర్ మధ్య భారీ పోరాటం ఉండబోతుందని తెలుస్తుంది. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాని విన్ ఫైజీ, లూయిస్ డి’ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మాణంలో ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవ్వనుంది.

    మీరు కూడా ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ డాక్టర్ డూమ్‌ ప్రోమో చూసేయండి..

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement