• Aug 25, 2026
  • NPN Log

    బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటారు. 2012 అక్టోబర్‌లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంటకు ఇద్దరు కుమారులు – తైమూర్ అలీ ఖాన్, జెహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. ఇద్దరి పిల్లల జననం సమయంలోనూ కరీనా తన ఫిట్‌నెస్, ప్రెగ్నెన్సీ ఫ్యాషన్‌తో వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు ఆమె మూడోసారి గర్భవతి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం తీవ్రంగా సాగుతోంది. ఇటీవల ఆమె ముంబైలో ఒక జిమ్ వెలుపల కనిపిస్తున్న వీడియో ఆధారంగా, ఆమె బేబీ బంప్‌తో ఉందంటూ నెటిజన్లు ప్రెగ్నెన్సీ ఊహాగానాలు మొదలుపెట్టారు.

    అయితే, ఈ రూమర్స్ వెలువడటానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే కరీనా షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఆగస్టు 16న భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కరీనా తన ఇన్స్టాగ్రామ్‌లో వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె బికినీ ధరించి ఎంతో స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించింది. ఆ ఫోటోలలో ఎక్కడా బేబీ బంప్ ఆనవాళ్లు లేవు.

    సరిగ్గా నాలుగు రోజుల క్రితం అంత ఫిట్‌గా ఉన్న కరీనా, ఉన్నపళంగా జిమ్ వెలుపల లూజ్ కాస్ట్యూమ్‌లో బేబీ బంప్‌తో ఎలా కనిపిస్తుందంటూ నెటిజన్లు విపరీతంగా చర్చించుకుంటున్నారు. కేవలం నాలుగు రోజుల్లో బేబీ బంప్ రావడం సాధ్యమేనా?.. లేదా అది కేవలం కెమెరా యాంగిల్, ఆమె వేసుకున్న వదులైన దుస్తుల వల్ల వచ్చిన పొరపాటా? అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. గతంలో కూడా కరీనాపై పలుమార్లు ఇలాంటి ప్రెగ్నెన్సీ రూమర్స్ రాగా, ఆమె వాటిని సరదాగా ఖండించింది. మరి ఈసారి వస్తున్న రూమర్లపై కరీనా లేదా సైఫ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement