• May 26, 2026
  • NPN Log

    తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ తొలిసారిగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించానన్న సీఎం విజయ్.. ఆకలి బాధలు అంటే ఏంటో తనకు తెలుసన్నారు. తనను అభిమానంగా పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

    'నేను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడిని. సినిమాల్లో నన్ను ఉన్నతస్థాయిలో నిలిపారు. తమ్ముడూ రా.. అంటూ పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చాను. నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభం' అని సీఎం విజయ్ అన్నారు.

    ప్రస్తుతం.. తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని విజయ్ తన ప్రసంగం ద్వారా వెల్లడించారు. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందని.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తామని.. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. 'దిస్ ఈజ్ న్యూ బిగినింగ్. ప్రజా ధనాన్ని వృథా చేయను.. దోచుకోను. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంది.. అది విజయ్ మాత్రమే. నేను పవర్ సెంటర్.. మరో పవర్ సెంటర్ ఉండదు.. ఉండబోదు. మైనారిటీ ప్రజలకు, విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటా. కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది. వారికి రుణపడి ఉంటా. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మిత్రువులైనా, శత్రువులైనా.. అందరికీ ఒకే చట్టం' అని ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement