• May 26, 2026
  • NPN Log


    జాతరలో దప్పుకొట్టే దళితుడిని చెంప దెబ్బలు కొట్టిన స్పీకరు అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు..
    రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండి విజ్ఞతతో ఉండాల్సిన వ్యక్తులు ఉత్సవంలో డప్పు కొట్టే మైల పల్లి దాసును అవమానకరంగా కొట్టడం నేరపూరితం, అమానుసం దీనికి పచ్చాత్తాప పడకుండా తిరిగి బాధితుడి చేత వీడియో లో మాట్లాడించి ఘటనను చిన్నది లేదా ఎవరో రాజకీయం చేస్తున్నారని చిలకపలుకులు పలికించడం వల్ల పోలీసు పిర్యాదు నుండి తప్పించుకోగలరు కాని సమాజం మిమ్మల్ని ఉపేక్షించదూ .. పోలీసు సుమోటోగా కేసు పెట్టాలన్నారు . ఈ ఘటనకు ఖచ్చితంగా  అయ్యన్న పాత్రుడుదే బాధ్యత అని వెంకట రావు నొక్కి చెప్పారు.. బేషరతుగా బహిరంగంగా  బాధితుడికి క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాలని వెంకట రావు హితవు పలికారు.  స్పీకరు స్పందించక పోతే దళిత సంఘాలు రోడ్డెక్కుతాయని హెచ్చరించారు .

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement