• May 26, 2026
  • NPN Log

    తిరుపతి జిల్లా : యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. నేడు, రేపో మామిడి కాయలను మండీలకు తరలించే సమయంలో ఈ విధంగా ఏనుగులు నష్టం కలిగించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    గడిచిన 4 నెలల కాలంలో సుమారు 60% వరకు అన్ని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు ఇలా పంటలను నాశనం చేస్తూ నష్టం కలిగిస్తూ పోతే తమకు చావే శరణ్యమంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల గుంపు నుంచి తమ పొలాలను కాపాడే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఫారెస్ట్ అధికారులను రైతులు కోరారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement