• May 26, 2026
  • NPN Log

    బంగ్లాదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. మధ్య బంగ్లాదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రధాన రహదారిపై ఐరన్ రాడ్స్, ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. దేశ రాజధాని ఢాకాకు వాయువ్యంగా 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంగైల్ జిల్లాలోని సోరటోయిల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

    ప్రయాణికులలో ఎక్కువ మంది దినసరి కూలీలే ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఈద్ అల్-అధా(బక్రీద్) సందర్భంగా తమ సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. అయితే.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ట్రక్కు బోల్తాపడి ఈ విషాదం జరిగిందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఘటన అనంతరం.. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు ప్రతిధ్వనించినట్టు చెప్పారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement