• May 26, 2026
  • NPN Log

    విజయవాడ: అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన బొందలపాటి రాజమ్మ 2004, ఆగస్టు 23న తనకున్న స్థిరాస్తుల్లో కొంత భూమిని పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చారు. తాడికొండ మండలం పాములపాడు గ్రామంలోని సర్వే నెంబరు 433లో మొత్తం 10 ఎకరాల 30 సెంట్లు ఉండగా, అందులో 64 సెంట్లు, సర్వే నెంబరు 432లో మరో ఆరు సెంట్ల మెరక భూమిని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని కనకదుర్గమ్మకు పసుపు, కుంకుమ కింద విరాళంగా ఇచ్చారు.

     

    అదే గ్రామంలో గ్రామ కంఠానికి చెందిన 235 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని బండి బాటతో సహా కనకదుర్గమ్మ గుడికి చెందేలా వీలు నామా రాశారు. ఈ రెండు భూముల ను 2013 డిసెంబరు 1న గుంటూరులో రిజిస్ర్టేషన్‌ చేయించారు. దుర్గ గుడితో పాటు పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి ఆలయం, కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి, పెనుగంచి ప్రోలు లోని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థా నానికి, శ్రీశైలంలోని శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానానికి, భద్రాచలం లోని భద్రాద్రి దేవస్థానానికి తనకున్న స్థిరాస్తులను విరాళాలుగా రాసి గుంటూరులో రిజిస్ర్టేషన్‌ చేయించారు.

    దుర్గగుడి భూములు కబ్జా

    దుర్గగుడికి ఇచ్చిన పాముల పాడులోని 70 సెంట్ల భూమిని కొందరు స్థానికులు కబ్జా చేశారు. 235 చదరపు గజాల స్థలాన్ని దాత రాజ మ్మ బంధువులు ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూముల రికార్డులను ఈవో శీనానాయక్‌ పరిశీలిస్తుండగా, పాములపాడులో ఈ భూములు ఉన్నట్టు గుర్తించారు. ఆలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకోగా, భూములను స్థానికం గా కొందరు ఆక్రమించుకున్నారని వెల్ల డించారు.

    కబ్జాకు గురైన 70 సెంట్ల భూమిలో దేవస్థానం పేరిట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ బోర్డును తొలగించారని వివరించారు. దీనిపై స్పందించిన ఈవో పూర్తి వివ రాలను తెలుసుకుని కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే భూములు ఉన్న ప్రాంతంలోని అధికారుల సహాయం తీసుకోవాలని ఆదేశించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement