• May 26, 2026
  • NPN Log

    పెనుకొండ, మే 25:

    శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిలిపి ఉంచిన లారీని మరో లారీ బలంగా ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్‌ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి సజీవదహనమయ్యారు.

    పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం:

    మండలంలోని పులేకమ్మ గుడి సమీపంలో బంగాళదుంపల లోడుతో ఉన్న ఒక లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది. కాగా, సోమవారం తెల్లవారుజామున గోధుమల లోడుతో వేగంగా దూసుకొచ్చిన మరో లారీ.. ఈ ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది.

    ​ఎగసిపడిన మంటలు.. క్యాబిన్‌లోనే అంతమైన ప్రాణం

    ​ఢీకొట్టిన వేగానికి గోధుమల లారీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు లారీ క్యాబిన్‌ మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాద తీవ్రతకు క్యాబిన్‌ నలిగిపోవడంతో, డ్రైవర్‌ సీట్లోనే ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయారు. దీంతో గోధుమల లారీ డ్రైవర్‌ కిరణ్‌ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

    మృతుడు ఆదిలాబాద్‌ వాసి

    ప్రమాదంలో సజీవదహనమైన డ్రైవర్‌ను తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కిరణ్‌గా పోలీసులు గుర్తించారు.

    ​సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద ధాటికి గోధుమల లారీ పూర్తిగా దగ్ధమైంది. హైవేపై జరిగిన ఈ ప్రమాదంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement