• May 26, 2026
  • NPN Log

    _తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మేనెల రెండో వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల మార్కును తాకడం భయాందోళన కలిగిస్తోంది.ఇప్పుడే ఇలాఉంటే రోళ్లు బద్దలయ్యే రోహిణి కార్తె పేరు వింటేనే జనాలు బెంబేలెత్తుతున్నారు._

    _ఈ ఏడాది (2026) రోహిణి కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది .. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం._

    _రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలిపోతాయ్ అని తీవ్రత ఎలా ఉంటుందో చెబుతారు. ఈ సమయంలో వేడిగాలులు, తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, అగ్నిప్రమాదాలు భయపెడతాయ్. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది._

    _రోహిణి కార్తే వచ్చిందంటే . అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు, రోకళ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. ఈ ఏడాది ( 2026) మే 25 నుంచి జూన్ 2 వరకు ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు , ఉక్కపోతలు ఉంటాయి._

    _జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ) ప్రవేశించినప్పుడు, ఆ క్షణం నుంటి తదుపరి పది నక్షత్రాల వరకు తీవ్రమైన వేడి గాలులు వీస్తాయి. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి._

    _ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం అయ్యేసరికి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వేడి గాలుల (వడగాల్పుల) ప్రభావంతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఉక్కపోత.. ఎండ తీవ్రతతో పలు ప్రాంతాల్లో మరిన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేలా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని కోరుతున్నారు._

    _రోహిణి కార్తెలో చేయాల్సిన పనులు ఇవే..!_

    _ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువగా మట్టికుండ నీళ్ళు త్రాగడం , మజ్జిగ , పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది... కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు._

    _పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చేందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి._

    _ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి_

    _నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి._
    _కాటన్ దుస్తులు వాడండి._
    _తెల్లని రంగు కల్గినవి , తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది._
    _ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి చిన్నపిల్లలను తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి._

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement