22నే పంచాయతీ పాలకవర్గాల తొలి భేటీ
తెలంగాణ : పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల తొలి సమావేశం 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ముందుగా పంచాయతీ కార్యాలయాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం పాలకవర్గాలు సమావేశమై చర్చిస్తాయి. కాగా 18 జిల్లాల్లో 90 పంచాయతీల్లో నిలిచిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికను ఈసీ ఆదేశాలతో అధికారులు ఈరోజు నిర్వహిస్తున్నారు.










Comments