సమ్మర్‌కు హైదరాబాద్ సిద్ధం: ట్యాంకర్ నెట్వర్క్ విస్తరణ
హైదరాబాద్‌లో వచ్చే 2026 సమ్మర్లో నీటి కొరత అధిగమించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ముందస్తు చర్యలు చేపట్టింది. GHMC, ఇంకా ORR పరిధిలో అంతరాయం లేని తాగునీటి సరఫరా కోసం సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
ప్రస్తుతం నగరంలో 1,150 ట్యాంకర్లు, 90 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు, 150 ఫిల్లింగ్ పాయింట్లు ఉన్నాయి. డిమాండ్ ఆధారంగా అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సంస్థ ఎండీ సూచించారు. HMWS&SB మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి అధికారులతో సమావేశమై, మైక్రో లెవల్ ప్లాన్లు రూపొందించాలని, నీటి కేటాయింపులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
తక్కువ సరఫరా జోన్లలో అడ్జస్ట్మెంట్లు చేయాలని అశోక్ రెడ్డి సూచించారు. అదనంగా, రానున్న ఐదేళ్లలో ORR పరిధిలో 50,000 రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్లు నిర్మించి, 5 నుంచి 10 TMC నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
ఇది భవిష్యత్తులో తాగునీటి పథకాల కొరత తొలగిస్తుందని అధికారులు అంచనా వేశారు. సమ్మర్ పీక్ సీజన్లో నీటి కొరతను అధిగమించేందుకు నాలుగు నెలల ముందుగానే ఈ ప్లాన్ రూపొందించడం గమనార్హం. ఈ చర్యలతో హైదరాబాద్ వాసులకు అంతరాయం లేని నీటి సరఫరా ఇవ్వాలని అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.









Comments