5 జిల్లాల పరిథిలో అమరావతి అమరావతి ఔటర్ రింగ్
ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. భూసేకరణకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవే శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. 189 KM మేర 6 లేన్లుగా ఈ నిర్మాణం జరగనుంది. దీని పరిధిలో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు రానున్నాయి. 23 మండలాల్లో ఉన్న 121 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. మొత్తం 5789 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అభ్యంతరాలకు 21 రోజుల గడువు విధించారు.










Comments