అప్‌గ్రేడ్ స్కూళ్లకు నైట్ వాచ్‌మెన్లను ఇవ్వండి
అమరావతి : ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు నైట్ వాచ్‌మెన్లను ఇవ్వాలని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకి ప్రకాశ్‌రావు, ఎంజీ మహదీ విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖ అధికారులకు గురువారం వేర్వేరుగా లేఖలు రాశారు. అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు బోధనా సిబ్బందిని కేటాయించినా రక్షణ కోసం వాచ్‌మెన్లను ఇవ్వలేదని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా నైట్ వాచ్‌మెన్లను ఇవ్వాలని కోరారు.










Comments