ఆ ఏరియా వాసులకు బిగ్ అలెక్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్
పంజాగుట్ట(హైదరాబాద్): బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ ఎమ్మెల్యే కాలనీ, ప్రగతి నగర్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ న్యాయవిహార్, పద్మాలయ స్టూడియో ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ ఎస్పీఆర్ హిల్స్ మహాత్మానగర్ ఫీడర్ పరిధి, ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 11 కేవీ ఈఎ్‌సఐ ఆస్పత్రి ఫీడర్ పరిధి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ బేగంపేట సూర్యోదయ కాంప్లెక్స్, వరుణ్ టవర్స్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ సోమాజిగూడ, పీఆర్ నగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
అల్లాపూర్: ఫీడర్ మరమ్మతుల కారణంగా అల్లాపూర్ డివిజన్‌లో గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ రాకే్‌షగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్‌బీఐ కాలనీ ఫీడర్ పరిధిలోని ఖైతలాపూర్ బ్రిజ్, చందానాయక్ తండా, విష్ణు విస్తారా ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టాటా మోటార్స్ ఫీడర్ పరిధిలో యశోద హాస్పిటల్స్, చర్చిరోడ్, టాటా మోటార్స్ లేన్, స్వచ్ రెస్టారెంట్ లేన్, గవర్నమెంట్ స్కూల్, చందానాయక్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.
సంతోష్ నగర్: టీఎస్ఎస్పీడీసీఎల్ సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని 11కేవీ న్యూనాగోల్, పసుమాముల, తారామతిపేట్, గౌరెల్లి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాలలో నిర్వహణపనుల కారణంగా గురువారం విద్యుత్‌సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ తెలిపారు. 11కేవీ న్యూనాగోల్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు, 11కేవీ పసుమాముల, తారామతిపేట్, గౌరెల్లి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.
మియాపూర్: మదీనగూడ సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా స్వర్ణపురి ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. పీఏనగర్, హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీ, రోడ్డు నంబర్ 1 నుంచి 14 వరకు, మహబూబ్ పేట్ మక్తా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.










Comments