కాలుష్య కోరల్లో ఢిల్లీ వాసులు!
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రజలు వాయు కాలుష్యం కోరల్లో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..! తాజా సర్వే ప్రకారం... ఢిల్లీలో 82ు మంది.. తమకు పరిచయం ఉన్న వారిలో ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది తీవ్రమైన కాలుష్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ‘లోకల్‌సర్కిల్’ అనే కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 28ు మంది తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, పొరుగువారు లేదా సహోద్యోగుల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఢిల్లీ, గురుగావ్, నోయిడా, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 34 వేల మంది పాల్గొన్నారు. కాగా, సోమవారం ఢిల్లీని పూర్తిగా దట్టమైన పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత ప్రమాదకర స్థాయిలో 498గా నమోదైంది.









Comments