జాతీయ హైవేలపై ప్రమాదాల కట్టడికి దేశవ్యాప్తంగా ఏకీకృత నిబంధనలు
న్యూఢిల్లీ : దేశంలోని ఎక్స్‌ప్రె్‌సవే, జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల కట్టడికి ఏకీకృత నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమాదాల సమస్య ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యవహారం కాదని, దేశవ్యాప్తంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాన్-ఇండియా తరహా నిబంధనలు తీసుకువస్తే తప్ప రహదారి ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. రాజస్థాన్‌లోని ఫలోడి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. జాతీయ రహదారుల ఆక్రమణలు, రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అక్రమ ధాబాల కారణంగానే రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది.









Comments