కైలాసగిరికి అదనపు ఆకర్షణ
సిరిపురం : విశాఖ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతున్న కైలాసగిరిపై మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ‘త్రిశూలం’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది. రూ.3 కోట్ల వ్యయంతో సుమారు 65 అడుగుల ఎత్తు కలిగిన భారీ త్రిశూలాన్ని ఢమరుకంతో కలిపి ఏర్పాటుచేశారు. ప్రారంభానికి సిద్ధమైన త్రిశూలం విద్యుత్ కాంతులీనుతూ, నగర వాసులకు ఎంతో ఆకర్షణగా కనిపిస్తుంది. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధుల చేతులమీదుగా శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. అనంతరం పర్యాటకుల సందర్శనకు అనుమతించనున్నారు.










Comments