భార్యను చంపి 72 ముక్కలు.. హైకోర్టు తీర్పు ఇదే
డెహ్రాడూన్‌లో భార్యను చంపి 72 ముక్కలుగా నరికేసిన సంచలన కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు దోషి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. నిందితుడు రాజేశ్ గులాటికి జీవిత ఖైదు, రూ.15 లక్షల ఫైన్ విధిస్తూ డెహ్రాడూన్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా రాజేశ్-అనుపమలకు 1999లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో 2010 అక్టోబర్ 17న భార్యను చంపి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచేయగా అదే ఏడాది డిసెంబర్ 12న విషయం బయటికొచ్చింది.









Comments