ముందస్తు అనుమతి ఉంటేనే న్యూఇయర్ వేడుకలు: పోలీసులు
తెలంగాణ : న్యూఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఈవెంట్కు ఎంత మంది వస్తున్నారు? ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో ముందే సమాచారమివ్వాలని ఇప్పటికే నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. అటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని చెప్పారు.










Comments