మెస్సీ టూర్‌పై బింద్రా కీలక వ్యాఖ్యలు
ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ పై ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మెస్సీని విమర్శించడం తన ఉద్దేశం కాదని, ఆయన ప్రయాణం కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అని తెలిపారు. అయితే తాత్కాలిక ప్రదర్శనలు, ఫొటోల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెడుతున్న శ్రద్ధలో కొంచెమైనా గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధిపై పెడితే బాగుంటుందన్నారు.










Comments