యూరిక్ ఆమ్లం అదుపులో
ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. అస్తవ్యస్థ జీవనశైలి, ఆహారపుటలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఆమ్లం మోతాదు... గుండె, మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బ తీస్తుంది. కాబట్టి సంబంధిత లక్షణాలను బట్టి కారణాలను సరిదిద్దుకుంటూ, వైద్యుల సూచనలను పాటించాలి
యూరిక్ ఆమ్లం, తగ్గినా, పెరిగినా ఆరోగ్య సమస్యలు తప్పవు. మన ఆహారపుటలవాట్లు, జీవనశైలులు ఈ ఆమ్లం పెరుగుదలకు దోహపడుతూ ఉంటాయి. సాధారణంగా మనకు ఈ ఆమ్లం గురించిన అవగాహన తక్కువ. పెరిగిన యూరిక్ ఆమ్లం వల్లే కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయని వైద్యులు చెప్పినప్పుడు, ఇలాంటి ఒక అమ్లం ఒకటి మన శరీరంలో ఉంటుందని మొదటిసారి తెలుసుకుంటూ ఉంటాం. ఈ ఆమ్లం పెరుగుదల వల్ల మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే ఈ సమస్య కొన్ని లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటుంది. అవేంటంటే..
ఒళ్లు నొప్పులు ఫ తేలికపాటి జ్వరం
పాదాలు, మోకాళ్లలో నొప్పులు
పిక్కల్లో నొప్పులు
కారణాలు లెక్కలేనన్ని
కొందరు పుట్టుకతో ఎంజైమ్ లోపాన్ని వెంట తెచ్చుకుంటారు. ఇలాంటి అరుదైన పరిస్థితి ఉన్నవారిలో యూరిక్ ఆమ్లం మోతాదు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఆమ్లం పెరుగుదలకు మరెన్నో కారణాలున్నాయి. అవేంటంటే...
నీళ్లు: కొంతమంది చాలా తక్కువ నీళ్లతో సరిపెట్టుకుంటూ ఉంటారు. సరిపడా నీళ్లు తాగని వారిలో డీహైడ్రేషన్ మూలంగా యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగిపోతుంది
అధిక ప్రొటీన్: ఎక్కువ మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకునే వాళ్లలో కూడా ఈ సమస్య తలెత్తుతుంది
మూత్రపిండాల సమస్య: మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో కూడా యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుతుంది
గుండె జబ్బు మందులు: హృద్రోగాల మందుల ప్రభావంతో కూడా ఈ సమస్య పెరుగుతుంది
క్యాన్సర్లు: కొన్ని రకాల క్యాన్సర్లు సోకినప్పుడు కూడా ఈ సమస్య వేధిస్తుంది
ఈ సమస్య ఎవరిలో ఎక్కువ?
యూరిక్ ఆమ్లం మోతాదు పెరిగే సమస్య కొంతమందిలో ఎక్కువ.
మద్యపానం
మధుమేహం
అధిక రక్తపోటు
రక్తం పలుచన చేసే ఎకోస్ర్పిన్ వాడకం
ఎవరికి వారు గ్రహించవచ్చు
మధుమేహులు, అధిక రక్తపోటుతో బాధపడేవారు, మద్యపానం అలవాటు ఉన్నవారు, ఎకోస్ర్పిన్ మందులు వాడుకుంటున్నవాళ్లలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగే అవకాశం ఉంది. అలాగే నీళ్లు తక్కువగా తాగే అలవాటున్న వాళ్లలో కూడా ఈ సమస్య పెరుగుతుంది. కాబట్టి, ఈ కోవలకు చెందిన వాళ్లందరూ పెరిగిన యూరిక్ యాసిడ్ తాలూకు లక్షణాలైన ఒళ్లు నొప్పులు, జ్వరం, కీళ్ల నొప్పులు బయల్పడినప్పుడు, అందుకు మూల కారణాన్ని ఎవరికి వారు గమనించుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు మందులు సక్రమంగా వాడుకుంటున్నారో లేదో, ఆ మందుల మోతాదు పెంచవలసిన అవసరం ఉందేమో గమనించుకోవాలి. అవసరాన్ని బట్టి ప్రత్యామ్నాయ మందులు ఎంచుకోవాలి. మద్యపానం తర్వాత కీళ్ల నొప్పులు వేధిస్తుంటే, ఆ అలవాటుకు దూరంగా ఉండాలి. అలాగే ఎకోస్ర్పిన్‌కు బదులుగా ప్రత్యామ్నాయ మందులు వాడుకోవాలి. ఏ కారణం లేకుండా లక్షణాలు వేధిస్తే, నీళ్లు సరిపడా తాగడం లేదేమో చూసుకోవాలి. అలాగే ఆ రోజు మాంసాహారం ఎక్కువగా తీసుకున్నామా అని కూడా ఆలోచించాలి. ఇలా ఎవరికి వారు కారణాలను గమనించుకుని, జాగ్రత్త పడాలి.
చికిత్స తేలికే..
రక్త పరీక్షతో శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ మోతాదును తేలికగా గుర్తించవచ్చు. ఆ పెరిగిన మోతాదులను సమం చేయడం కోసం వైద్యులు సూచించే నోటి మాత్రలను వాడుకోవాలి. వైద్యులు సూచన మేరకు పరీక్షలు చేయించుకుంటూ, సమస్య అదుపులోకి వచ్చినప్పుడు మందులను ఆపేయవచ్చు. అయితే ఎంజైమ్ లోపాన్ని పుట్టుకతో వెంట తెచ్చుకోవడం మూలంగా శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగిపోయే వ్యక్తులు జీవితాంతం మందులు వాడుకోక తప్పదు. యూరిక్ యాసిడ్ అదుపులో ఉంచుకోవడానికి అనుసరించవలసిన అత్యంత ముఖ్యమైన అంశం... సరిపడా నీళ్లు తాగడం.
ప్రధాన అవయవాలు కుదేలు
యూరిక్ యాసిడ్, శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ను సృష్టించి, అన్ని అవయవాలనూ ప్రభావితం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి దీంతో స్వల్ప అస్వస్థలే కాకుండా తీవ్ర రుగ్మతలూ తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా యూరిక్ యాసిడ్‌కూ కొలెస్ట్రాల్ పెరుగుదలకూ, మూత్రపిండాల సమస్యలకూ సంబంధం ఉంటుంది. రక్తంలో కలిసి ఉండే యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగితే, అది మొదట స్ఫటికాల్లా మారి, తర్వాత రాళ్ల రూపం దాలుస్తుంది. ఏ అవయవంలో ఈ యాసిడ్ ఎక్కువగా చేరుకుంటే, ఆ అవయవం ఎక్కువగా ప్రభావితమవుతుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల ప్రభావం గుండె మీద కూడా పడుతుంది. అలాగే మూత్రపిండాల పనితీరు, కాలేయం, పిత్తాశయం పనితీరులు కూడా దెబ్బతింటాయి. కీళ్లతో పాటు, మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ ప్రభావితమవుతుంది. అలాగే పెరిగే యూరిక్ యాసిడ్ మోతాదు మధుమేహానికి కూడా దారి తీస్తుంది.
గౌట్
కాలి బొటనవేలిలో తలెత్తే తీవ్రమైన నొప్పి ఇది. ఈ సమస్య రాత్రికి రాత్రే మొదలవుతుంది. కీలు ఎర్రగా మారి, భరించలేని నొప్పితో ఇబ్బంది పెడుతుంది. చేత్తో తాకలేని పరిస్థితి ఉంటుంది. జ్వరం కూడా ఉంటుంది. అయితే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం మూలంగానే గౌట్ వస్తుందనుకోవడం పొరపాటు. ఈ యాసిడ్ సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ గౌట్ వచ్చే అవకాశాలుంటాయి.
ఆహార నియమాలు
యారిక్ ఆమ్లం అదుపులోకి వచ్చేవరకూ మాంసాహారం మానేయడం మంచిది. వృక్షాధారిత మాంకృత్తులైన పప్పుధాన్యాలు తినాలి. అయితే మినప్పప్పు, రెడ్ కిడ్నీ బీన్స్ యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి కాబట్టి వీటి వాడకం తగ్గించి, క్రూసిఫెరస్
కూరగాయలైన కాలిఫ్లవర్, క్యాబేజీ
తీసుకోవాలి. నట్స్ తినాలి. పాలు,
పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవచ్చు.









Comments