రుణం చెల్లించిన సొసైటీ వారు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదని మహిళా రైతు ఫిర్యాదు
పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో జడ్డంగి గ్రామ నివాసి అయిన పోసిన సత్యవతి అనే మహిళ రైతు క్రాప్ లోన్ తీసుకుని ఉండగా ఆ లోను ను నిర్ణీత గడువులోపే అసలు వడ్డీ కలిపి చెల్లించి70 రోజులు కావస్తున్నా పట్టాదారు పాసుపుస్తకంను తిరిగి ఇవ్వమని కోరగా ఇవ్వటం లేదని సొసైటీ చైర్మన్ ను సంప్రదించిన సొసైటీ సీఈవో దగ్గరకు వెళ్లిన ఎటువంటి స్పందన లేదని మూడు రోజుల క్రితం జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇస్తామని చెప్పారే దాని ఇప్పటికే ఇవ్వలేదని దీనిపై తగు న్యాయం జరగకుంటే జిల్లా కలెక్టర్ వారికి మహిళా రైతుకు ఫిర్యాదు చేస్తానని కన్నీరు పెట్టుకుని విలపించడం జరిగింది అలాగే వారి బంధువు మర్నీడి రామచక్రం పుస్తకం కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు










Comments