అక్షర్‌కు గాయం.. రేపటి మ్యాచులో ఆడతాడా?
ఒమన్‌తో మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రేపు పాక్‌తో జరిగే మ్యాచులో ఆడటంపై అనుమానాలున్నాయి. నిన్న బౌండరీ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నిస్తుండగా అక్షర్ తలకు గాయమైంది. వెంటనే ఆయన మైదానాన్ని వీడారు. దీంతో ఆయన రేపటి మ్యాచులో పాల్గొంటారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అక్షర్ దూరమైతే భారత్ ఇద్దరు స్పిన్నర్లతోనే (కుల్దీప్, వరుణ్) ఆడాల్సి వస్తుంది.
Comments