రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. త్వరలో పాక్‌తో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్ తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 స్క్వాడ్స్‌లో డికాక్‌ను చేర్చింది. 2023 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు, 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు డికాక్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments