గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం: రవూఫ్ భార్య
పాక్ మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన పనితో గర్వంగా ఉన్నానని ఆ జట్టు బౌలర్ హారిస్ రవూఫ్ భార్య ముజ్నా మసూద్ తెలిపింది. నిన్న మ్యాచ్ సందర్భంగా రవూఫ్ ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేశాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ముజ్నా.. ‘గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం’ అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
Comments