ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంత అప్పు చేశాయంటే?
2025-26 ఆర్థిక సంవత్సరం 9నెలల్లో ఆంధ్రప్రదేశ్ రూ.56,072 కోట్లు, తెలంగాణ రూ.69,300 కోట్లు అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభ లో వైసీపీ ఎంపీ బాబూరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రూ.26,57 కోట్లు, తెలంగాణ రూ.17,400 కోట్లు, రెండో క్వార్టర్‌లో ఆంధ్రప్రదేశ్ రూ.17,600 కోట్లు, తెలంగాణ 32,500 కోట్లు, మూడో క్వార్టర్‌లో ఆంధ్రప్రదేశ్ రూ.11,900 కోట్లు, తెలంగాణ రూ.19,400 కోట్లు ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేసినట్లు వివరించారు.










Comments