• Apr 05, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : అత్యాధునిక సౌకర్యాలతో జీడిమెట్ల గాజులరామారంలో టీజీఎస్‌ ఆర్టీసీ 100 ఎకరాల్లో ఆధునిక బస్‌టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రత్యేక బస్‌ టెర్మినల్‌తోపాటు సిటీ బస్సులకు ఒక టెర్మినల్‌, ఎలక్ర్టిక్‌ బస్సుల కోసం ప్రత్యేక చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌కురోజూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఈ బస్‌ టెర్మినల్‌ నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌.. గాజులరామారంలో 100ఎకరాలను టీజీఎస్‌ఆర్టీసీకి ఇటీవల కేటాయించారు. ఇందులో సుమారు 30 ఎకరాల్లో అంతరాష్ట్ర బస్సుల కోసం ప్రత్యేక బస్‌ టెర్మినల్‌ అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తోంది. సిటీ బస్సులను ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు నడిపేలా సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ టెర్మినల్‌ను ఆధునిక సౌకర్యాలు, షాప్‌లతో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ర్టిక్‌ బస్సు డిపో, ఈవీ బస్సుల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక చార్జింగ్‌ స్టేషన్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement