ఆర్థిక సమస్యలున్నా అందరికీ ప్రయోజనం: అనగాని
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ‘జీఎస్టీ వసూళ్లు, వృద్ధి రేటులో రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది. రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Comments