డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్ : విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Comments