*కాఠ్‌మాండూ-విశాఖకు ప్రత్యేక విమానం.. లోకేశ్ ఆదేశం
అమరావతి: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను తరలించేందుకు కాఠ్‌మాండూ నుంచి విశాఖకు ప్రత్యేక విమాన సర్వీసు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నేపాల్‌లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
Comments