*డ్రోన్ల నిఘా నీడలో అనంతపురం... సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభ కోసం 55 డ్రోన్లతో నిఘా
ఈ సభ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 250 నూతకెమేరాలతో కలుపుకుని ఇదివరకే ఉన్న నగరంలో 400 సిసికెమేరాలు వినియోగం
* శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, మాబ్ కంట్రోల్, నేర నియంత్రణ, తదితరాలపై ప్రధాన దృష్టి
* గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారి ఆదేశాలు... జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి పర్యవేక్షణలో రంగంలోకి సుశిక్షితులైన డ్రోన్ ఆపరేటర్లు
* సభాస్థలి, వేదిక, హెలీప్యాడ్ , ప్రముఖులు పర్యటించే రహదారులు/ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, డైవర్షన్ పాయింట్స్, సభకు వచ్చి వెళ్లే రహదారులు... ఇలా అన్ని కోణాల్లో కవర్ చేస్తూ డ్రోన్లు ఎగురవేయనున్న పోలీసు సిబ్బంది... విజయోత్సవ సభ పూర్తీగా కవరయ్యేలా సిసికెమెరాలు ఏర్పాటు
* వీటితో పాటు నగరంలో మరియు విజయోత్సవ సభ దారుల్లో ట్రాఫిక్ పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకునేలా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టిన పోలీసుశాఖ
* డ్రోన్లు, సిసికెమేరాల పనితీరు మరియు పర్యవేక్షించి తదనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేట్టేలా అప్రమత్తం చేసేందుకు సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు... సదరు విభాగానికి ఇన్ఛార్జి అధికారిగా డి.ఐ.జి శ్రీ సత్య ఏసుబాబు IPS గారు.
Comments