నేను తప్పులు చేశాను.. మరోసారి తన విడాకుల గురించి మాట్లాడిన సామ్
జీవితంలో తప్పు చేయని మనిషే ఉండడు. కానీ, ఆ తప్పును సరిద్దిదుకున్నవాడే ఎదుగుతాడు. అలాగే తాను చేస్తున్నాను అని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె NDTV వరల్డ్ సమ్మిట్ లో పాల్గొంది. ఈ సమ్మిట్ లో సామ్ తన వ్యక్తిగత విషయాల గురించి, తన కెరీర్ గురించి, నాగ చైతన్యతో జరిగిన విడాకుల గురించి, హెల్త్ గురించి మాట్లాడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోల్స్.. ఆ సమయంలో ఆమె ఎలా ఉంది అనేది వివరించింది.
' నా జీవితంలో ఏది జరిగినా అది ప్రజల సమక్షంలోనే జరిగింది. నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను.. విడాకుల విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ.. అన్ని పబ్లిక్ గానే జరిగాయి. ఎన్నో ట్రోల్స్, ఎంతోమంది జడ్జిమెంట్స్..సోషల్ మీడియాలో అలా ఉండబట్టే ఇలా జరిగిందని ఎన్నో మాటలు అన్నారు.
డిపెండబిలిటీ అనేదానికి ఒక గమ్యస్థానం ఉండదు. అలా కొనసాగుతూనే ఉంటుంది. నా జీవితంలో పరిష్కారాలు నాకు తెలియవు. కానీ, నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. నేను పర్ఫెక్ట్ కాదు. నేను తప్పులు చేశాను. దెబ్బలు తిన్నాను. కానీ, ఇప్పుడు నేను బెటర్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.
సోషల్ మీడియా వలన వచ్చే ఒత్తిళ్లు, అందులో అతి సంపన్నుల జీవితాలను చూసి సాధారణ ప్రజలు తమకు తామే అసమర్ధులుగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ.. బాగా రిచ్ గా బ్రతికే 1 శాతం మందినే చూస్తున్నారు. వారి ఇళ్లు, వారి వెకేషన్స్.. ఇవన్నీ మిగతావారిని డీమోటివ్ చేస్తున్నాయి' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Comments