ఆధార్, వెబ్ ల్యాండ్ ఆధారంగా రబీ ఎరువుల పంపిణీ
ఆంధ్ర ప్రదేశ్ : రబీ సీజన్ ఎరువుల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబరు, వెబ్ ల్యాండ్‌లో రైతుకున్న భూకమతం ఆధారంగా.. పంటల వారీగా, అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఫారసు మేరకు ఎరువులను అందిచనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు. రబీ సీజన్ సాగు సన్నద్ధత, ఎరువుల పంపిణీ అంశాలపై శుక్రవారం జిల్లాల వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.
Comments