మాక్ అసెంబ్లీ.. 21 నుంచి విద్యార్థుల ఎంపిక
ఆంధ్ర ప్రదేశ్ : అమరావతిలో వచ్చే నెల 26న విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అందుకోసం ఈ నెల 21, 22 తేదీల్లో 6-8 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు జరగనున్నాయి. 24, 25 తేదీల్లో మండలస్థాయి పోటీలు, ఈ స్థాయి నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేసి 29, 30 తేదీల్లో నియోజకవర్గ లెవల్‌లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 175 మందిని ఎంపిక చేసి అమరావతి అసెంబ్లీకి తీసుకెళ్తారు.
Comments