ఈనెల 28 నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ
ఆంధ్ర ప్రదేశ్ : వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి విద్యార్థికి ఈసారి తప్పనిసరిగా అపార్ ఐడీ(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎవరికైనా లేకపోతే వెంటనే చేయించాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. అటు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
Comments