ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటో వద్దు
అమరావతి : ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం ఫొటో ప్రదర్శిస్తున్నారంటూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు ఈ పిల్ దాఖలు చేశారు. చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తీసుకొచ్చేవరకు కార్యాలయాల్లో పవన్ ఫొటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌తో పాటు వ్యక్తిగత హోదాలో పవన్ కల్యాణ్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది.
Comments