బండ్ల ఇంట దీవాళీ బాష్.. ఇండస్ట్రీ మొత్తం హాజరు.. మరి అల్లు అరవింద్..?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్న మాటను నిర్మొహమాటంగా బయటకు చెప్పే వ్యక్తుల్లో బండ్ల ముందు ఉంటాడు. దీనివలన ఆయన ఎంతోమంది స్నేహితులను కోల్పోయాడు. అయినా కూడా నిజాయితీగా మాట్లాడే తత్వాన్ని పోగొట్టుకోలేదు. ఒకప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్న బండ్ల.. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మీడియా ముందకు రావడం తప్ప.. అంతగా కనిపించడం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి బండ్ల నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బండ్ల గణేష్ - దీపావళీ పండగ విడదీయరాని అనుబంధం. ప్రతి ఏడాది ఎక్కువ క్రాకర్స్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టడం, అది కాస్తా వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి క్రాకర్స్ పండగను మరింత వెలుగులతో నింపాలని చూస్తున్నాడట. ఈ దీపావళికి ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి తన ఇంట్లోనే పార్టీ ఇవ్వనున్నాడట. ఈ పార్టీకి ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచాడని తెలుస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు సమాచారం. బాస్ వస్తున్నాడు అంటే.. ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుంది.
ఇక ఇండస్ట్రీ అంటే అల్లు అరవింద్ కూడా వస్తాడా.. ? ఆయనకు కూడా ఆహ్వానం అందిందా.. ? అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. అదేంటి.. అల్లు అరవింద్ ఎందుకు రాడు.. వీరిద్దరి మధ్య విభేదాలు ఎప్పుడు వచ్చాయి.. అని అంటే ఒక్క సక్సెస్ మీట్ వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చేలా చేసింది. మొదటినుంచి బండ్ల - అల్లు అరవింద్ ఫ్యామిలీ సన్నిహితంగానే ఉండేది. బన్నీ హీరోగా తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో సినిమాను నిర్మించింది కూడా బండ్లనే. అప్పుడప్పుడు పార్టీల్లో, ఈవెంట్స్ లో కలుసుకుంటూనే ఉంటారు.
ఇక ఈ మధ్యనే బండ్లన్నను లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ కు గెస్ట్ గా ఆహ్వానించారు. ఆ స్టేజ్ పై బండ్లన్న ఇండస్ట్రీ గురించి పచ్చి నిజాలు బయటపెట్టాడు. మాఫియా అని, తొక్కేస్తారని.. ఇలా ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలను మౌళికి వివరించాడు. అంతేనా అల్లు అరవింద్ గురించి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బండ్ల చేసిన వ్యాఖ్యలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెల్సిందే. నిజం చెప్పాలంటే అల్లు అరవింద్ పరువు పోయింది. ఇక అక్కడి నుంచే వీరి మధ్య విభేదాలు తలెత్తాయని టాక్.
ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లు మధ్యలో నిర్మాత బన్నివాస్ వచ్చి నా వెన్త్రుక పీకలేరు.. వేరోచోట వెంట్రుక ఉన్న కూడా నా సంస్కారం తలమీద వెంట్రుక అనే చూపిస్తున్నా అని మాట్లాడి హీట్ పెంచాడు. మరి బండ్లన్న ఊరుకుంటాడా.. ఎక్స్ లో కౌంటర్ కూడా వేశాడు. అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా గట్టి యుద్ధమే నడుస్తుంది. ఈ లెక్కన కనీసం అల్లు అరవింద్ కి బండ్ల ఆహ్వానం కూడా పంపి ఉండడు అనే అనుమానం కూడా రాకపోలేదు. ఇండస్ట్రీ మొత్తం హాజరు అయితే అల్లు అరవింద్ రాకపోవడం అనేది మరోసారి ఆయనకు అవమానమే అని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి ఈ విభేదాల వలన విడిపోయిన వీరు మళ్లీ ఎప్పుడు కలుస్తారు అనేది చూడాలి.
Comments