బోల్ట్ సరసన లైల్స్
టోక్యో: అమెరికా స్టార్ నోవా లైల్స్ జమైకా దిగ్గజ స్ర్పింటర్ ఉసేస్ బోల్ట్ రికార్డును సమం చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో లైల్స్ వరుసగా నాలుగోసారి 200 మీటర్ల స్ర్పింట్ టైటిల్ కొల్లగొట్టాడు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో తలపడిన ఎనిమిదిమంది రన్నర్లు బరిలో దిగడంతో శుక్రవారంనాటి ప్రపంచ అథ్లెటిక్స్ 200 మీ. ఫైనల్ హోరాహోరీగా సాగింది. కానీ అందర్నీ వెనక్కునెట్టిన నోవా 19.52 సె. టైమింగ్‌తో స్వర్ణం గెలిచాడు. దాంతో గతంలో ఈ ఫీట్ సాధించిన జమైకా గ్రేట్ బోల్ట్ సరసన లైల్స్ చేరాడు. అమెరికాకే చెందిన కెన్నీ బెడ్నరెక్ (19.58 సె.), రజతం, జమైకా రన్నర్ కెన్నీ లెవెల్ (19.64సె.) కాంస్యం చేజిక్కించుకున్నారు. ఒలింపిక్ చాంపియన్ లెస్లీ టెబెగో నాలుగో స్థానంలో నిలిచాడు.
మెలిస్సా గోల్డెన్ డబుల్: గత పోటీల మహిళల 200 మీ. విజేత షెరికా జాక్సన్ (జమైకా) టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. 22.18 సె.లలో గమ్యం చేరిన షెరికా కాంస్యానికే పరిమితమైంది. మెలిస్సా జఫర్సన్ ఉడెన్ (21.66సె.) స్వర్ణం సొంతం చేసుకోగా, అమీ హంట్ (బ్రిటన్- 22.14సె.) రజతం నెగ్గింది. ఈసారి 100 మీ. స్ర్పింట్‌లోనూ టైటిల్ అందుకున్న జఫర్సన్ 200మీ. టైటిల్‌తో ‘గోల్డెన్’ డబుల్ సాధించింది.
Comments