శ్రీకాంత్ అవుట్
హాంకాంగ్: ప్రపంచ మాజీ నెంబర్‌వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు హాంకాంగ్ ఓపెన్‌లో చుక్కెదురైంది. మెయిన్ డ్రా కూడా చేరకుండా క్వాలిఫయర్స్‌లోనే కంగుతిన్నాడు. క్వాలిఫయర్స్ ఆరంభ రౌండ్లో భారత్‌కే చెందిన తరుణ్ మన్నెపల్లి 28-26, 21-13తో కిడాంబికి షాకిచ్చి సంచలనం సృష్టించాడు. అయితే, ఆ తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్లో తరుణ్ 23-21, 13-21, 18-21తో జస్టిన్ హాన్ (మలేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో స్టార్ జోడీ సాత్విక్/చిరాగ్ శెట్టి 21-13, 18-21, 21-10తో తైవాన్ ద్వయం సియాంగ్/వాంగ్ లిన్‌పై గెలిచింది. సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ మెయిన్ డ్రాకు చేరాడు.
Comments