గ్రేట్ మేడమ్.. 4 నెలల్లో 30 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ కోర్టులో షాట్లు కొడుతూ ప్రత్యర్థులను మట్టికరిపించిన గుత్తా జ్వాల.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం మరింత గొప్ప పోరాటం చేస్తోంది. ఆమెకు ఇది మెడల్ గెలిచే పోటీ కాదు. ప్రాణాలను కాపాడే పోరాటం. గత నాలుగు నెలల్లో, జ్వాల ఒక అరుదైన, హృదయాన్ని కదిలించే సేవ చేసింది. తన బిడ్డకు పాలు తాగించిన తర్వాత మిగిలిన చనుబాలను ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న పుట్టిన శిశువులకు దానం చేస్తోంది.
తల్లి అయిన తర్వాత గత నాలుగు నెలల్లో 30 లీటర్ల పాలు డొనేట్ చేసింది. ప్రస్తుతం రోజుకు 600 ml ఇతర పిల్లల కోసం పంపుతుంది. ఈ నిర్ణయం ఆమె మనసు ఎంత విశాలమో తెలియజేస్తుంది. పుట్టిన వెంటనే తల్లి పాలు అందని శిశువుల కోసం.. తల్లి అనారోగ్యం, ప్రసవ సమస్యల కారణంగా పాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్న చిన్నారుల కోసం, ఈ పాలు నిజంగా అమృతం అనే చెప్పాలి. ఈ నిర్ణయం దిశగా తనను ఫ్యామిలీ డాక్టర్ మంజుల అనగాని ముందుకు నడిపినట్లు తెలిపింది.
2021 ఏప్రిల్ 22న నటుడు విష్ణు విశాల్ ను పెళ్లాడింది గుత్తా జ్వాల. నాలుగేళ్ల తర్వాత అదే రోజు పాపకు ఈ దంపతులు జన్మనిచ్చారు. కాగా తాజా నిర్ణయంపై గుత్తా జ్వాలపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments