శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం
ఆంధ్రప్రదేశ్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,312 మంది దర్శించుకోగా.. 27,728 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
Comments