నేడు ఇలా చేస్తే పితృశాపాలు తొలగిపోతాయి
నేడు మహాభరణి. ఇది పితృపక్షంలో భరణి నక్షత్రం రోజున వస్తుంది. ఈరోజున పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం చేయడం వల్ల వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పితృదోషాలు తొలగి, ఐశ్వర్యం, దీర్ఘాయువు ప్రాప్తిస్తాయి. నేడు యమదీపం వెలిగించడం శుభప్రదం. అన్నదానం, ఆవు నెయ్యి కలిపిన నల్ల నువ్వుల అన్నాన్ని కాకులకు పెట్టడం ద్వారా పితృశాపాలు తొలగిపోతాయి. వారి అనుగ్రహం లభిస్తుంది’ అని అంటున్నారు.
Comments