సీఎం రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కొండా దంపతుల వెంట సీఎం నివాసానికి వెళ్లారు.
తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ విషయంలో వివాదం రేగుతోంది. దీనికి సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఇటీవల తొలగించడం, ఆయన కోసం పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడం తదితర పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి కొండా సురేఖ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Comments